
శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్-ఏ టీమ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్స్ అంతా తీవ్రమైన నిరాశలో మునిగిపోయి ఉండగా, బయట మాత్రం డెబ్బై ఏళ్ల ఓ పెద్దాయన ఒక ప్లేయర్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారు. గ్రౌండ్ సిబ్బంది పనులను ముగిస్తున్నప్పటికీ, ఆయన మాత్రం అక్కడే నిల్చున్నారు. ఆయన మరెవరో కాదు క్రికెట్ దిగ్గజం అనుర టెన్నెకూన్.
అనుర టెన్నెకూన్ కొలంబో నుంచి ఇంత దూరం ప్రయాణించి వచ్చింది కేవలం 15 ఏళ్ల భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కలవడానికి కావడం విశేషం. చివరకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వైభవ్.. నేరుగా ఆ పెద్దాయన దగ్గరు వెళ్లి, కిందకు వంగి పాదాలకు నమస్కరించాడు. వాళ్లిద్దరి మధ్య సంభాషణ కొద్దిసేపు సాగినప్పటికీ, ఆ మాటలు వైభవ్‌కు ఎంతో ధైర్యాన్నిచ్చాయని తెలుస్తోంది. ఐపీఎల్‌లో బ్యాటింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు కొట్టే సిక్సర్లు, ఫోర్లు అద్భుతం. ఇదే ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నానని టెన్నెకూన్ తెలిపారు.
ఏదీఏమైన, ఒక అంతర్జాతీయ దిగ్గజం ఓటమి బాధలో ఉన్న ఒక యువ ఆటగాడికి ధైర్యం చెప్పడానికి గంట సేపు వేచి చూడటం నిజంగా గొప్ప విషయం.

