Categories: Sports

యువ ఆటగాడి కోసం క్రికెట్ దిగ్గజం అనుర టెన్నెకూన్ నిరీక్షణ

శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్-ఏ టీమ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్స్ అంతా తీవ్రమైన నిరాశలో మునిగిపోయి ఉండగా, బయట మాత్రం డెబ్బై ఏళ్ల ఓ పెద్దాయన ఒక ప్లేయర్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారు. గ్రౌండ్ సిబ్బంది పనులను ముగిస్తున్నప్పటికీ, ఆయన మాత్రం అక్కడే నిల్చున్నారు. ఆయన మరెవరో కాదు క్రికెట్ దిగ్గజం అనుర టెన్నెకూన్.

అనుర టెన్నెకూన్ కొలంబో నుంచి ఇంత దూరం ప్రయాణించి వచ్చింది కేవలం 15 ఏళ్ల భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కలవడానికి కావడం విశేషం. చివరకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వైభవ్.. నేరుగా ఆ పెద్దాయన దగ్గరు వెళ్లి, కిందకు వంగి పాదాలకు నమస్కరించాడు. వాళ్లిద్దరి మధ్య సంభాషణ కొద్దిసేపు సాగినప్పటికీ, ఆ మాటలు వైభవ్‌కు ఎంతో ధైర్యాన్నిచ్చాయని తెలుస్తోంది. ఐపీఎల్‌లో బ్యాటింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు కొట్టే సిక్సర్లు, ఫోర్లు అద్భుతం. ఇదే ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నానని టెన్నెకూన్ తెలిపారు.

ఏదీఏమైన, ఒక అంతర్జాతీయ దిగ్గజం ఓటమి బాధలో ఉన్న ఒక యువ ఆటగాడికి ధైర్యం చెప్పడానికి గంట సేపు వేచి చూడటం నిజంగా గొప్ప విషయం.

ManaTV Team

Recent Posts

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

5 hours ago

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…

5 hours ago

అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’

జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…

8 hours ago

అల్లు అర్జున్‌కి నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…

9 hours ago

‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…

12 hours ago

ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ కట్టా.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా నటి అంజలి

స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…

14 hours ago