అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ బోస్టన్ చాప్టర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ హాజరై కాంగ్రెస్ నాయకులు, తెలుగు మరియు భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ మాతృభూమిపై భారతీయులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తోందని, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, విదేశాల్లో సంపాదించిన అనుభవం, నైపుణ్యంతో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, IOC ద్వారా సమర్థవంతమైన నాయకులను తయారు చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి…
తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…
ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…
#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…
Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…