
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జూలై 10న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ క్రమంలోనే మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు వినూత్నమైన ప్రమోషనల్ స్ట్రాటజీలను రెడీ చేస్తున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఒక క్రేజీ ప్రచారం ఊపందుకుంది. సినిమా ప్రమోషన్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అఖిల్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసే ఒక టాక్ షో తరహా ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కెరీర్ పరంగా అఖిల్‌కి ఈ ‘లెనిన్’ చిత్రం చాలా కీలకం. ఈసారి ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొట్టాలనే పట్టుదలతో అఖిల్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. దీనికి తగ్గట్లే ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ స్టార్ హీరోలు సైతం అఖిల్ మేకోవర్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. దీంతో ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు మరింత అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఒకవేళ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ప్రచారం గనుక నిజమైతే, రిలీజ్ ముందే ఈ సినిమాకు భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బిజినెస్ రేంజ్ ఊహించని స్థాయికి చేరుకోవడం ఖాయం. ఈ సెన్సేషనల్ కాంబో ఇంటర్వ్యూపై క్లారిటీ రావాలంటే మాత్రం మూవీ మేకర్స్ ఇచ్చే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే.

