Categories: Movie News

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఖరారు.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీతో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొత్త పోస్టర్‌లో ప్రభాస్ యుద్ధభూమిలో గాయాలతో, రక్తపు మరకల మధ్య తుపాకీ చేతబట్టి కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. శిథిలాల నడుమ ఒంటరిగా పోరాడుతున్న సైనికుడిగా ఆయన లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. “ఒంటరిగా పోరాడే ఓ బెటాలియన్” అనే ట్యాగ్‌లైన్ కథలో దేశభక్తి, త్యాగం, ధైర్యానికి ప్రాధాన్యం ఉండబోతున్నట్లు సూచిస్తోంది. మొత్తంగా పోస్టర్ రూపకల్పనలో చారిత్రక అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్‌ను ఉపయోగించారు. దీంతో సినిమా ఏ కాలం నేపథ్యంలో సాగుతుందనే చర్చ అభిమానుల్లో మొదలైంది. అయితే కథకు సంబంధించిన కీలక వివరాలను మాత్రం చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది.

ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేసేలా చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హను రాఘవపూడి–ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ పోస్టర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

ManaTV Team

Recent Posts

TTA Mega Conventionలో యూఎస్ పొలిటికల్ ఫోరం.. అమెరికా రాజకీయాలపై ఆది రెడ్డి సాథి ప్రత్యేక ప్రసంగం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…

6 hours ago

H-1B, గ్రీన్ కార్డ్, EB-5 వీసాలపై నిపుణుల మార్గదర్శనం

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస…

6 hours ago

TTA లో 100కు పైగా వ్యాపార సంస్థల ప్రదర్శనలు

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్…

6 hours ago

అమెరికాలో జూలై 19న శ్రీనివాస కళ్యాణం

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్…

7 hours ago

TTA మెగా కన్వెన్షన్‌కు కీరవాణి స్పెషల్ అట్రాక్షన్

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని…

7 hours ago

మాట నిలబెట్టుకున్న అఖిల్.. అభిమానిని కలిసిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…

9 hours ago