బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడంతో ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆమె డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో అవామీ లీగ్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. కత్తులు, ఈటెలతో ఆందోళనలు చేపట్టడంతో పాటు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) బలగాలతో పాటు 1,350 మంది పోలీసులను మోహరించింది.
మరోవైపు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు పొందేందుకు షేక్ హసీనా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఆమె స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో భారత్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
హసీనా తిరుగు ప్రయాణం, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారాయి.
నిరుద్యోగులకు అగ్రికల్చర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్…
తెలంగాణలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తనకు, తన…
మధ్యప్రదేశ్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త బిట్టూ తబాహీ నది శుభ్రత కార్యక్రమంలో అనారోగ్యం బారిన పడ్డారు. అజ్నార్ నదిలో పేరుకుపోయిన…
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో ‘శివ శంభో స్వయంభో’ పేరుతో అద్భుతమైన…
Exclusive Interview with Vivek Rao, Founder & Chairman of The USA Maharaja Club International #Mana…