తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను బయటకుతీయడమే లక్ష్యంగా హెచ్‌సీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీకి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.
టైటిల్ స్పాన్సర్ గా శ్రీనిధి యూనివర్సిటీ ఎంపికయింది. లీగ్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో హెచ్‌సీఏ, ఫ్రాంచైజీలు ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచాయి. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ డిస్ ప్లే షో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో లీగ్ లో పాల్గొనే జట్ల లోగోలను ఆకాశంలో ప్రదర్శించారు.
ఈ లీగ్ లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతుండగా.. ప్రతి టీమ్ మిగతా అన్ని టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనున్నాయి. ఈ నెల 23న పాలమూరు స్ట్రైకర్స్ తో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తలపడనుంది. ఈ లీగ్ లో విజేతగా నిలిచిన టీమ్ కు రూ.కోటి నగదు బహుమతి, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.50 లక్షలు అందిస్తారు. అలాగే మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. మొత్తంగా యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా నిలుస్తున్న ఈ టీజీ20 లీగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…
Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…