Find Articles

అట్లాంటా హిందూ ఆలయంలో నాగుల చవితి వేడుకలు.. శ్రీ నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

అట్లాంటా హిందూ ఆలయంలో నాగుల చవితి వేడుకలు.. శ్రీ నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

అమెరికాలోని అట్లాంటా హిందూ టెంపుల్‌లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి శ్రీ నాగేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.

నవంబర్ 13, 2026, శుక్రవారం రోజున ఈ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీ నాగేంద్ర స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు నాగేంద్ర స్వామి అర్చన నిర్వహిస్తారు.

ఈ పూజల్లో పాల్గొనే భక్తుల కోసం అభిషేకం స్పాన్సర్‌షిప్‌ను 51 డాలర్లుగా, అర్చన స్పాన్సర్‌షిప్‌ను 15 డాలర్లుగా నిర్ణయించారు.

నాగుల చవితి సందర్భంగా శ్రీ నాగేంద్ర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం, కుటుంబ సంక్షేమం కలగాలని భక్తులు ప్రార్థించనున్నారు.

ఈ పవిత్ర పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అట్లాంటా హిందూ టెంపుల్ నిర్వాహకులు కోరారు.

ManaTV Team