Find Articles

అమెరికాలో ఘనంగా దీపావళి, హనుక్కా వేడుకలు.. ఐక్యత, సౌహార్దానికి ప్రతీకగా సాంస్కృతిక సంబరాలు

అమెరికాలో ఘనంగా దీపావళి, హనుక్కా వేడుకలు.. ఐక్యత, సౌహార్దానికి ప్రతీకగా సాంస్కృతిక సంబరాలు

అమెరికాలో భారతీయ, యూదు సముదాయాల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, సౌహార్దాన్ని చాటుతూ దీపావళి, హనుక్కా లైట్స్ సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. JCC & UMC USA మహారాజా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇరు సముదాయాలకు చెందిన పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంస్కృతంలో దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుంది. అదే విధంగా యూదుల పండుగైన హనుక్కా కూడా వెలుగు, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా జరుపుకుంటారు.

ఈ సందర్భంగా భారతీయ, యూదు సముదాయాలకు చెందిన కళాకారులు నిర్వహించిన నృత్య, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఇరు వర్గాల వారు తమ సంప్రదాయ వంటకాలు, మిఠాయిలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ నాయకులు, అధికారులు హాజరై నిర్వాహకులను అభినందించారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిన ఈ వేడుక మత సామరస్యం, పరస్పర గౌరవం, సామాజిక ఐక్యతకు వేదికగా నిలిచింది.

ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన వివేక్ రావు గారికి, అలాగే కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ManaTV Team