Find Articles

చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్.. అంబరాన్ని తాకుతున్న సంబరాలు

చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్.. అంబరాన్ని తాకుతున్న సంబరాలు

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతేకాదు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్సీబీ విజయంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

ఆర్సీబీ విజయోత్సవాల్లో విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ మ్యాచ్ లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, టీమ్ ను ఒంటిచేత్తో గెలిపించారు. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ వరుస వికెట్లు పడిపోయాయి. అలాంటి క్లిష్ట సమయంలో విరాట్ కోహ్లీ ఆడిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మామూలు మ్యాచ్‌లలో గెలిస్తేనే విరాట్ కోహ్లి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది వరుసగా ఆర్సీబీ రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో ఆయన తోటి ప్లేయర్లతో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ను ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ స్టార్టింగ్ లోనే శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో 20 ఓవర్లలో 155/8 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్ తో రాయల్ ఛాలెంజర్స్ బరిలోకి దిగింది.ఈ క్రమంలోనే వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32 పరుగులతో మంచి ఆరంభం అందించగా.. విరాట్ కోహ్లీ 75 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మొత్తంగా ఆర్సీబీ 18 ఓవర్లలో 161/5 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ManaTV Team