Find Articles

గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌.. కొత్త మూవీ ‘సింగ’ టైటిల్ గ్లింప్స్

గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌.. కొత్త మూవీ ‘సింగ’ టైటిల్ గ్లింప్స్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన హీరోగా రాబోతున్న 34వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు ‘సింగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.

‘ గాయపడిన అడవికి అతడే ప్రళయం.. పవిత్రతకు ముప్పు వస్తే అతడే రక్షణ కవచం” అంటూ గ్లింప్స్‌లో వినిపించిన వాయిస్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. టైటిల్‌కు తగ్గట్టే గోపీచంద్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. వి.వెంకట్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తంగా గోపిచంద్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘సింగ’ టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

ManaTV Team