
న్యూజెర్సీ నార్త్ బ్రన్స్‌విక్‌లోని సాయి పరివార్ మందిర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కమ్యూనిటీ నాయకులు, ప్రముఖులు, దాతలు మరియు సాయి భక్తులు పాల్గొని ఆలయ నిర్మాణానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నూతన ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అలాగే ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆలయ నిర్వాహకులు భక్తులను కోరారు. విరాళాలు, సేవా కార్యక్రమాలు మరియు స్వచ్ఛంద సేవ ద్వారా ఈ మహత్తర ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నూతన సాయి బాబా ఆలయం భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించే పవిత్ర క్షేత్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందిర్ కమిటీ ప్రెసిడెంట్ సురేంద్ర కథులా, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ చిల్లార, తుషార్ పటేల్, నిమిష్ పటేల్, సభ్యులు పాల్గొన్నారు.
Title and SEO tags for website

