Find Articles

టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

టాలీవుడ్ లో తనదైన నటన, అందంతో ‘సోగ్గాడు’గా పేరు తెచ్చుకున్న దివంగత నటుడు శోభన్‌బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో కన్నుమూశారు.

కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న శాంతకుమారి.. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో తనను పరామర్శించడానికి వచ్చిన ఒక ఆప్తమిత్రురాలితో ఆమె మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.

శాంతకుమారి హఠాన్మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తూ, నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆమె భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. శోభన్‌బాబు స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలో కూడా శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా, ఒక సాధారణ గృహిణిగా కుటుంబ బాధ్యతలను చూసుకునేవారు.

ManaTV Team