ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి వచ్చింది. కెన్సింగ్టన్ ప్యాలెస్ సమీపంలో, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరంలో ఈ డ్యూప్లెక్స్ ఉన్నట్లు సమాచారం.
ఈ ఆస్తి విలువ సుమారు 12 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు ₹140 కోట్లకు పైగా)గా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ ఆస్తి యజమానిగా ఇరాన్‌కు చెందిన బ్యాంకర్ అలీ అన్సారీ పేరు నమోదై ఉంది.
అయితే ఆస్తికి సంబంధించిన రుణ వాయిదాలను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో, రుణదాతలు ఈ పెంట్‌హౌస్‌ను వేలం వేస్తున్నట్లు సమాచారం. ఆస్తి యాజమాన్యం, ఇరాన్ రాజకీయ వర్గాలతో సంబంధాలపై ఉన్న ఆరోపణలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.