Find Articles

తుఫాన్‌ అర్నబ్‌ ఎఫెక్ట్‌.. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్కూళ్ల సెలవులపై ఉత్కంఠ!

తుఫాన్‌ అర్నబ్‌ ఎఫెక్ట్‌.. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్కూళ్ల సెలవులపై ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల వైపు తుఫాన్‌ అర్నబ్‌ దూసుకొస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, అక్టోబర్‌ 28వ తేదీ ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్‌, యానాం తీరాలను తుఫాన్‌ దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలపై తుఫాన్‌ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

స్కూళ్లకు సెలవులపై అధికారి

ManaTV Team