అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక దాడులకు దిగే అవకాశం ప్రస్తుతం అత్యంత తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై కొనసాగుతున్న చర్చల్లో పురోగతి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఒప్పందం కుదరడంపై తదుపరి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని ట్రంప్ తెలిపారు.
అయితే, ఇరాన్‌లోని 38 వంతెనలను లక్ష్యాలుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు అమెరికాకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే తీవ్ర ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు.
దీంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు, పరస్పర హెచ్చరికలు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారాయి.