అమెరికాలోని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC) 55 ఏళ్ల వేడుకల సందర్భంగా ఘనంగా దసరా, దీపావళి సంబరాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. 2026 నవంబర్ 14న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నేపర్విల్లేలో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆయనతో పాటు పలువురు కళాకారుల ప్రదర్శనలతో గ్రాండ్ మ్యూజికల్ ఈవెనింగ్ నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, చిన్నారుల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ఫ్యాషన్ ర్యాంప్ వాక్, చిల్డ్రన్స్ డే స్పెషల్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు డిన్నర్, అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి కొనసాగనుంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. TAGC సభ్యులకు కొన్ని కార్యక్రమాల్లో ఉచిత ప్రవేశం కల్పించగా, ఇతరులకు ఆన్లైన్, వేదిక వద్ద టికెట్ ధరలను నిర్ణయించారు. సీటింగ్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఈ వేడుకలు Yellow Box, 1635 Emerson Lane, Naperville, Illinois 60540లో జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం www.tagc.org వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
TAGC 55 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ దసరా, దీపావళి వేడుకల్లో చికాగో పరిసర ప్రాంతాల తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.