పిల్లలు, యువతతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన షేర్ చేసిన ఒక హృదయపూర్వక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
“నిన్న ఇద్దరు యువ మిత్రులు సేవా తీర్థకు వచ్చారు” అంటూ ప్రధాని మోదీ ఆ పిల్లలతో జరిపిన సంభాషణకు సంబంధించిన కొన్ని అందమైన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటోలలో ప్రధాని పిల్లలతో ఎంతో ఆత్మీయంగా, నవ్వుతూ ముచ్చటించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.