Find Articles

జెలెన్‌స్కీకి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.. విమానానికి అత్యంత సమీపంలోకి డ్రోన్

జెలెన్‌స్కీకి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.. విమానానికి అత్యంత సమీపంలోకి డ్రోన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ డ్రోన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ వెల్లడించారు.

విమానం నుంచి డ్రోన్ కాస్త అటూఇటుగా వచ్చినా ఢీకొనే ప్రమాదం ఉండేదని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ విమానానికి ఎంత దూరంలోకి వచ్చిందన్న వివరాలను వెల్లడించలేదు.

ఈ ఘటన అనంతరం జెలెన్‌స్కీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం ఆయన ప్రయాణిస్తున్న విమానం నార్వే రాజధాని ఓస్లోలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే డ్రోన్ ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ManaTV Team