సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు హాజరైన ఆయన, అనంతరం సతీమణి లత, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మనవళ్లతో కలిసి ఏథెన్స్ నగరంలో సందడి చేశారు.
ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తున్న రజనీకాంత్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కుటుంబ సభ్యులతో సూపర్ స్టార్ గడిపిన ఈ ఆనందకర క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.