కోలీవుడ్‌లో మరోసారి స్టార్ హీరో విజయ్ క్రేజ్ కనిపించింది. సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ విడుదలను చిత్రబృందం వాయిదా వేసింది. ముందుగా జులై 23న విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ మార్పుకు ప్రధాన కారణం విజయ్ నటించిన ‘జన నాయగన్’ అదే రోజు విడుదల కావడమే. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో, బాక్సాఫీస్ పోటీకి దూరంగా ఉండాలని ‘ఇమ్మోర్టల్’ మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రిలీజ్ వాయిదాపై జీవీ ప్రకాశ్ కూడా ఆసక్తికరంగా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో “దళపతి వస్తుంటే తప్పుకోవాలి కదా… అదీ చివరిసారిగా” అంటూ విజయ్, ‘జన నాయగన్’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రేక్షకుల ప్రేమ, మద్దతుతో ‘ఇమ్మోర్టల్’ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వస్తుందని పేర్కొన్నారు.
మరియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇమ్మోర్టల్’లో జీవీ ప్రకాశ్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోగా, రొమాంటిక్ కామెడీతో మొదలై హారర్ థ్రిల్లర్‌గా మారిన కథాంశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస…
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…