Categories: International

పాకిస్థాన్‌లో ప్రముఖ టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి..

పాకిస్థాన్: రావల్పిండిలో ప్రముఖ టీవీ యాంకర్ రబియా అహ్సాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. తన నివాసంలోనే ఆమె తుపాకీ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఆదివారం గుల్షన్‌ఆబాద్ ప్రాంతంలోని ఆమె ఇంట్లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు సంబంధించి అనుమానిత తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రబియా అహ్సాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతోనే ఈ ఘటన జరిగిందని ఆమె భర్త చెబుతున్నట్లు సమాచారం.

అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

ManaTV Team

Recent Posts

రైతులకు కేంద్రం శుభవార్త.. ఎరువుల సబ్సిడీకి రూ.62,370 కోట్లు ఆమోదం

రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 11న జరిగిన…

6 hours ago

లండన్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. ఒక్కచోట చేరిన పలు దేశాల ప్రజలు

వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి…

9 hours ago

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా నామకరణం

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చారు. విజయవాడ వేదికగా బుధవారం తన నూతన రాజకీయ పార్టీ…

9 hours ago

కమల్ హాసన్ కొత్త సినిమా ‘సండియార్’పై వివాదం.. టైటిల్ మార్చాలంటూ డిమాండ్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ తమిళనాడులో వివాదానికి దారితీసింది. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన…

9 hours ago

పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు.. రిటైర్మెంట్ వరకు ఫిట్‌నెస్ తప్పనిసరి!

ప్రొబెషనరీ డీఎస్పీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి…

11 hours ago

రూ.500, రూ.1000, రూ.2000 నోట్లు రద్దు చేయాలా? చంద్రబాబు కీలక డిమాండ్.. దేశవ్యాప్తంగా చర్చ

అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

11 hours ago